మహబూబాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. పెండింగ్ దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పింఛన్లు, పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖకు సంబంధించి అధికంగా దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అఽధికారులు పని చేయాలన్నారు. 172 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, జిల్లాస్థాయి అధికారులు తెలిపారు.
వచ్చిన కొన్ని వినతులు పరిశీలిస్తే..
గూడూరు మండలం గాజులగట్టు గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు మొత్తం బిల్లులు చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. వినతి ఇచ్చిన వారిలో రమేశ్, దేవా, ఈర్యా, వీరన్న ఉన్నారు.
రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులు జారీ చేయాలని, 2024 మార్చి నుంచి బకాయిలు ఇవ్వాలని వినతి అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, నాయకులు కిషన్ నాయక్, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహశబరీష్
ప్రజావాణిలో 172 వినతులు


