మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు అక్రమ విక్రయాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. ఎస్పీ శబరీశ్ ఆదేశాల మేరకు పోలీసులు సోమవారం సంబంధిత శాఖ అధికారులతో కలిసి గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి సుమారు 12 కిలోల నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. రైతులను మోసం చేస్తూ నకిలీ, ని షేధిత విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే, సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి ప్రజా సమస్యలపై మీడియా అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల అధికారులు వేగంగా స్పందిస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఎస్పీ చిత్రపటానికి క్షీరాభిషేకం
వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ కి
గ్రామస్తుల కృతజ్ఞతలు


