విగ్రహాల తొలగింపు.. భద్రపరిచేందుకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

విగ్రహాల తొలగింపు.. భద్రపరిచేందుకు ఏర్పాట్లు

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

ఫొటో, వీడియో చిత్రీకరణలో

కొనసాగుతున్న పనులు

కాళేశ్వరం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో ప్రాకారాల్లో విగ్రహాలు, ఉప ఆలయాల్లో మూలవిరాట్టులను తొలగిస్తున్నారు. ప్రధాన గర్భగుడిలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి జోడు లింగాలను అక్కడే మూసివేశారు. గర్భగుడి స్తంభా లను కూడా తొలగిస్తారు. ప్రాకారంలోని భారీ హ నుమాన్‌, మత్స్య విగ్రహాలను, ప్రధాన ఆలయం ఎదుట ఉన్న నంది విగ్రహం, శ్రీసరస్వతి అమ్మవా రి ఆలయంలోని విగ్రహాన్ని తీశారు. నవగ్రహాలు, స్పటిక లింగం తొలగించారు. ఇంకా శ్రీశుభానందా దేవి, శృంగీ, బృంగీ విగ్రహాలు, పడమర, దక్షిణం, ఉత్తర నందులు తొలగించాల్సి ఉంది. సరస్వతి, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయాల్లోని వెండి ఆభరణాలను భద్రపరుస్తున్నారు. తొలగించిన వి గ్రహాల కోసం ప్రత్యేకంగా దేవాదాయశాఖ ఏర్పా ట్లు చేపట్టింది. శ్రీరాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో ఫ్లైవుడ్‌తో బాక్స్‌లు తయారు చేస్తున్నారు. ఆ బాక్సుల్లో ధాన్యం పోసి విగ్రహాలను భద్రపరిచేందకు తమిళ శిల్పులతో తయారీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే ధాన్యం 20 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. సుమారు 25మంది వరకు తమిళ శిల్పులు తొలగింపు పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనులను ఫొ టోలు, వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement