యోగాతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Jun 22 2026 1:00 AM | Updated on Jun 22 2026 1:00 AM

ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌

మహబూబాబాద్‌/మహబూబూబాద్‌ అర్బన్‌: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు. ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ మానుకోట శాఖ ఆధ్వర్యంలో ఆది వారం స్థానిక గిరిజన భవన్‌లో అంతర్జాతీయ యో గా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకుని, ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. ప్రధానంగా యువత యోగాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఒత్తిడి, ఉరుకులు, పరుగుల జీవితంలో శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా అసరమన్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా వస్తున్న అనేక ఆరోగ్య సమస్యలకు యోగాతో అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఆరోగ్యాన్ని మించిన అస్తి లేదనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్నేహశబరీష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement