హేమాచలక్షేత్రంలో కోలాహలం | - | Sakshi
Sakshi News home page

హేమాచలక్షేత్రంలో కోలాహలం

Jun 22 2026 1:00 AM | Updated on Jun 22 2026 1:00 AM

మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు పవన్‌కుమార్‌ ఆచార్యులు, రాజీవ్‌ శర్మ, ఈశ్వర్‌చంద్‌రామానుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement