న్యూశాయంపేట : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో వందశాతం అడ్మిషన్లు సాధించే దిశగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థల(టెమ్రిస్) ఉమ్మడి వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్ దామోదర్‌రెడ్డి సూచించారు. శనివారం పెద్దమ్మగడ్డ, ములుగురోడ్డులోని హనుమకొండ(బి1) గురుకులంలో ఉమ్మడి జిల్లా ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యనందించే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. నాణ్యమైన విద్య, కార్పొరేట్ స్థాయిలో ఉన్న మైనార్టీ గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని మైనార్టీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆలోచించాలన్నారు. సమావేశంలో ఆర్‌ఎల్‌సీ జంగా సతీశ్, విజిలెన్స్ అధికారులు సయ్యద్ అక్బర్, మక్బూల్‌పాష, కో–ఆర్డినేటర్ రుహీనా, ప్రిన్సిపాళ్లు భిక్షపతి, శ్రీనివాస్, కృష్ణకుమారి, నీలిమాదేవి, నీరజ, శ్రీపాల, రాజు, మాధవిలత, శ్రీలత, అన్నపూర్ణ, ఆయేషా, వందన, తదితరులు పాల్గొన్నారు.
టెమ్రిస్ డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్
దామోదర్‌రెడ్డి


