నిరంజన్‌కు రూ.5 లక్షల ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

నిరంజన్‌కు రూ.5 లక్షల ఆర్థిక సాయం

Jun 21 2026 12:43 AM | Updated on Jun 21 2026 12:43 AM

నయీంనగర్‌: జన్యుపరమైన అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌కు సినీ ని ర్మాత బండ్ల గణేశ్‌ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. శనివారం ఉదయం నిరంజన్‌ ఇంటికెళ్లి అతడితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. పరమేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ తరఫున రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం గణేశ్‌ మీడియాతో మాట్లాడుతూ కారులో తిరగాలనే బాలుడు నిరంజన్‌ కోరిక మేరకు వాహనం కొనుక్కొమని రూ. 5 లక్షలు ఇచ్చానన్నారు. నిరంజన్‌ తల్లిదండ్రులు రాంగోపాల్‌ చారి, మానస దంపతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఆన్‌లైన్‌ మోసం..

రూ.67 వేలు

కాజేసిన కేటుగాళ్లు

రామన్నపేట : పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరుతో ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టించి ఓ యువకుడి నుంచి రూ.67 వేలు కాజేసిన ఘటన శనివారం వరంగల్‌లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ డాక్టర్స్‌ కాలనీ–2లోని స్నేహనగర్‌కు చెందిన నాయిని సాయి తేజ (26) ఫేస్‌బుక్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల కోసం వెతుకుతుండగా ఒక అప్లికేషన్‌ కనిపించింది. దానిని డౌన్‌లోడ్‌ చేసి తన వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్నాడు. అనంతరం పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని యాప్‌లో చూపించడంతో నమ్మి మోసగాళ్లు అందించిన క్యూఆర్‌ కోడ్‌కు ఇటీవల తన ఫోన్‌పే ఖాతా ద్వారా మొదట రూ.50 వేలు పంపించాడు. తర్వాత మరో రూ.14 వేలు, రూ.2, 994 కూడా పెట్టుబడిగా చెల్లించాడు. కొంతకాలానికి తన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి 1930 నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. మొత్తం రూ.67 వేలునష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొనగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల ద్వారా వచ్చే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, ఆన్‌లైన్‌ టాస్కులు, అధిక లాభాల పెట్టుబడుల ప్రకటనలను నమ్మి డబ్బులు చెల్లించొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement