భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

మహబూబాబాద్‌: భూదార్‌ సర్వే, భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ లోకేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి జిల్లాల కలెక్టర్‌లతో భూదార్‌ సర్వే, భూభారతి, సాదాబైనామా, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రతీ భూ యజమానికి సంబంధించి కచ్చితమైన భూవివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో నక్ష డిజిటల్‌ భూమ్యాపింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. భూ రికార్డుల ఆధునికీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీసీలో కలెక్టర్‌ స్నేహశబరీష్‌, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement