బాలికల భద్రతే షీ టీం లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బాలికల భద్రతే షీ టీం లక్ష్యం

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: బాలికల భద్రతే లక్ష్యంగా షీ టీం పనిచేస్తోందని ఎస్సై సునంద అన్నారు. ఎస్పీ శబరీష్‌ ఆదేశాల మేరకు జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాల విద్యార్థినులకు షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు, బాలికల భద్రత, షీ టీమ్స్‌ సేవలు, సైబర్‌ నేరాల నివారణ, సోషల్‌ మీడియాలో తీసుకోవాల్సి న జాగ్రత్తలపై ఎస్సై సునంద వివరించారు. ఈవ్‌ టీజింగ్‌, వేధింపులు, బాల్య వివాహాలు జరిగితే షీ టీం నంబర్‌ 87126 56935లో ఫిర్యాదు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, సైబర్‌ మోసాలపై 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం షీ టీం అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు. పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, షీ టీం సిబ్బంది రమేశ్‌, పార్వతి, హైమావతి, ప్రియాంక, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement