హత్య కేసులో మహిళ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో మహిళ అరెస్ట్‌

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

గూడూరు: భర్తను ఇసుర్రాయితో తలపై మోది చంపిన కేసులో భార్య బోడ విజయను గురువారం రాత్రి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వి. వినయ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గూడూరు సర్కిల్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ కలహాలతో మండలంలోని తేజావత్‌రాంసింగ్‌తండా శివారు సోమ్లాతండాలో గురువారం తెల్లవారుజామున భర్త బోడ లాలును అతని భార్య ఇసుర్రాయి బండతో మోది చంపిన విషయం తెలిసిందేనన్నారు. ఈ కేసులో విజయను విచారించిన అనంతరం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. కార్యక్రమంలో ఎస్సై గిరిధర్‌రెడ్డి, సిబ్బంది కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement