టేకుమట్ల : ఆ వ్యక్తి 14 సంవత్సరా ల క్రితం చెయ్యి కోల్పోయాడు. అ యినా జీవితంపై ఏ మాత్రం ఆత్మవిశ్వాసం, ధైర్యం కోల్పోలేదు. ఒంటి చేతితో పనులు చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయనే జయశంకర్ భూ పాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆరెపల్లికి చెందిన గురి జాల మల్హల్‌రావు. బాల్యంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మల్హల్‌రావు చేతికి గాయమైంది. కాలక్రమేణా ఇన్‌ఫెక్ష న్ కారణంగా 2012లో వైద్యులు చెయ్యిని పూర్తిగా తొలగించారు. అయినా ఏమాత్రం బాధపడలేదు. అధైర్య పడలేదు. అప్పటి నుంచే ఒంటి చేతితో వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. అంతే కాకుండా బైక్‌ను కూడా సునాయాసంగా నడపడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొన్ని రోజులుగా గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకంలో పనులకు కూడా వెళ్తూ ఒంటి చేతితో పలుగు పట్టి తవ్వడం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది.
ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న వారికి కనువిప్పు కలిగేలా..
ఎలాంటి శారీరక వైకల్యం లేకున్నా పని చేయకుండా ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న వారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారందరికీ మల్హల్‌రావు ఆదర్శంగా నిలుస్తున్నాడు. చెయ్యి కోల్పోయినా ధైర్యం కోల్పోకుండా ఇతరులతో సమానంగా అన్ని పనులను చేసుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వ్యవసాయ పనుల్లో ఎరువు బస్తాలను సులువుగా బైక్‌పై తీసుకెళ్తుంటే ఔరా అనాల్సిందే. పంట పొలాలకు సైతం కూలీలను ఇద్దరు చొప్పున బైక్‌పై తీసుకెళ్తూ రెండు చేతులు ఉన్న వారి కంటే తాను ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ వైకల్యాన్ని జయిస్తున్నాడు మల్హల్‌రావు .
ఒంటి చేతితో పలుగు పట్టి..
బైక్ నడిపి
చెయ్యి కోల్పోయినా జీవితంపై
చెదరని ఆత్మవిశ్వాసం
సొంతంగా పనులు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న మల్హల్‌రావు


