హన్మకొండ : టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీ నం చేయడమే ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన డిమాండ్ అని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్–1, హనుమకొండ డిపో స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా డిపోలకు చెందిన టీఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ నుంచి పలువురు కార్మికులు ఎంప్లాయీస్ యూనియన్‌లో చేరారు. ఈ సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వంలో విలీన అంశాన్ని వదలి ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు ఎన్నికలు కోరుకుంటుందని చేస్తున్న దుష్ప్రచా రంలో వాస్తవం లేదన్నారు. సమ్మె నోటీసు ఇవ్వని సంఘాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని కార్మికులు పట్టించుకోవద్దన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ రీజియన్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వి.కె.స్వామి, నాయకులు టి.శ్రీనివాస్, మురళి, శ్రీధర్, సుధాకర్, ఎల్లయ్య, ఎం.రాజు, మ హేందర్, బాలరాజు, పి.కె.స్వామి, ఎం.రవీందర్, రాజయ్య, పి.రవీందర్, సంధ్య, అర్చన, విజయ, రజిత, ఉమ, జమున, అమరావతి పాల్గొన్నారు.
ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న


