నా కొడుకుకు ఫ్రీ బస్‌ పాస్‌ ఇయ్యండి.. | - | Sakshi
Sakshi News home page

నా కొడుకుకు ఫ్రీ బస్‌ పాస్‌ ఇయ్యండి..

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

కాశిబుగ్గ: ‘నా కొడుకుకు కాళ్లు, చేతులు సరిగా లే వు.. నాకు చాత కాదు. దివ్యాంగుడైన కన్నకొడుకును చూసుకుంటూ బతుకుతున్నా. ఓ పూట తింటూ, మరో పూట పస్తులుంటూ కాలం గడుపుతు న్నా. మంచానికి పరిమితమైన కొడుకును పొద్దున, రాత్రి చూసుకుంటున్నా. ఎంజీఎం దవాఖాన సార్లు నా కొడుకుకు ఫ్రీ బస్‌ ఇచ్చి, నాకు సగం టికెట్‌ ఉండే బస్‌ పాస్‌ ఇయ్యండి’ అంటూ జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లా మహముత్తారం మండలం ములు గుపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు జాడి అంకయ్య వేడుకుంటున్నారు. శుక్రవారం కొడుకు రాజయ్య ను వీల్‌చైర్‌లో తీసుకొచ్చి ఎంజీఎం పరిసరాల్లో తచ్చాడుతున్నాడు. మూడు రోజుల నుంచి తన కొడుకుకు బాగా లేకుంటే సర్కారు దవాఖానకు తీసుకొచ్చానని, గట్లనే బస్‌పాస్‌ ఇస్తే తీసుకెళ్తానని చెబుతున్నాడు. మూడేళ్ల క్రితం నా కొడుకుకు ఆఫ్‌ టికెట్‌ బస్‌ పాస్‌ ఇచ్చారని, నాకు ఫుల్‌ టికెట్‌ తీసుకుంటున్నారని చెప్పాడు. మా దుస్థితి జరా చూసి ఫ్రీ బస్‌ పాస్‌ ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని సదరం క్యాంపు అధికారులను అంకయ్య వేడుకుంటున్నాడు.

సదరం క్యాంపు అధికారులను

వేడుకుంటున్న వృద్ధుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement