నయీంనగర్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి నిరసనగా ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్, కార్పొరేట్ మాఫియాకు అంబాసిడర్‌లా వ్యవహరిస్తూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తున్నాడన్నారు. విద్యా హక్కు చట్టం అటకెక్కిందని, రేషనలైజేషన్ పేరుతో 2,3000 ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు సీఎం రేవంత్ రెడ్డి పూనుకుంటున్నాడని, ఈ నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రైవేట్‌లో ఫీజుల దోపిడీని అరికట్టి నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జూపల్లి దీపిక, రాజ్‌కుమార్, సుజిత్, అభిలాశ్, నవీన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
ఏబీబీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు


