న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026
762
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు
40,703
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో విద్యార్థుల నమోదు లేదనే కారణంతో 162 ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారు. దీనికి కారణం ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించడం లేదని.. అందుకోసమే తమ పిల్లలను పంపడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ప్ర భుత్వ పాఠశాలలు మూతపడటం మంచిది కాదని, వాటిని తెరిపించాలని ఉన్నతాధికారులు పదే పదే చెప్పారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు విద్యార్థులు లేక మూతపడిన 12 పాఠశాలలను తెరిచారు. ప్రస్తుతం ఆ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.
162 పాఠశాలలు మూత..
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని జిల్లాలోని 162 పాఠశాలలు మూసివేశారు. గత ఏడాది 152 పాఠశాలలు మూసి ఉండగా అందులో కొన్ని బడులు అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, తండాపెద్దలు, ఇతర వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసే వారి చొరవతో తెరిచారు. కానీ, ఈ ఏడాది మళ్లీ మొదటికి వచ్చింది. విద్యార్థులు లేని పాఠశాలలు 162 ఉన్నాయని అందుకోసమే వాటిని మూసివేశామని అధికారులు చెబుతున్నారు. కాగా, అదివాసీ, గిరిజన పిల్లలు అధికంగా ఉన్న మరిపెడ, కేసముద్రం, చిన్నగూడూరు, గూడూరు మండలాల్లో ఎక్కువగా పాఠశాలలు మూతపడ్డాయి. గిరిజన, ఆదివాసీ విద్యార్థులు అడవి, పొలం గట్లు దాటుకుంటూ.. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
తెలుచుకుంటున్న బడులు..
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందించాలని అధికారులకు పదే పదే చెబుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కలెక్టర స్నేహ శబరీష్ ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో జిల్లాలోని విద్యార్థులు లేక మూతబడిన 162 పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా చిన్నగూడూరు మండలం చేపూరుతండా, డొర్నకల్ మండలం చాంప్లాతండా, నర్సింహులపేట మండలం అమీర్యాతండా, పెద్దవంగర మండలం సోమ్లాతండా, సీరోలు మండలం అందనాలపాడు, మరిపెడ మండలం మాలోత్ తండా, మహబూబాబాద్ మండలంలోని లక్ష్మీపురం తండా, పీఎస్‌బీఎన్‌తండా, కురవి మండలం రాజతండా, హరిదాస్ తండా, భద్రుతండా, కొత్తగూడ మండలం ఆదిలక్ష్మీపురంలోని పాఠశా లలు తెరుచుకున్నాయి.
జిల్లాలో ఈ విద్యాసంవత్సరం తెరుచుకున్న12 ప్రభుత్వ పాఠశాలలు
గతంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉందని
162 బడుల మూత
విద్యార్థులను చేర్పించి తెరవాలని అధికారుల ఆదేశం
బడిబాటలో విద్యార్థుల వేట


