● సీపీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్ కుమార్
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ సర్వే ఎంత వరకు వచ్చిందని, నారాయణపురం గ్రామంలో భూ సర్వే వేగవంతం చేయాలని సీపీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్ కుమార్, ల్యాండ్ సర్వే కమిషనర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా అధికారులతో వారు సమీక్షించారు. భూభారతి, సాదాబైనామా భూ సమస్యలు పరిష్కరించాలన్నా రు. క్షేత్రస్థాయిలో పకడ్బందీగా సర్వే నిర్వహించాలన్నారు. కేసముద్రం మండలంలోని నారాయణపురం తదితర గ్రామాల భూ సమస్యల పరి ష్కారం కోసం ఇప్పటికే ప్రత్యేక విభాగం క్షేత్రస్థాయిలో పనిచేస్తుందన్నారు. అటవీ, రెవెన్యూ, ల్యాండ్ సర్వే శాఖల సర్వేల ద్వారా రైతులకు సమాచారం అందించి త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూభారతి, సాదాబైనామాలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులను గ్రామసభలు నిర్వహించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా నక్ష, ల్యాండ్ సర్వేలను పూర్తి సమాచారాన్ని సర్వేయర్ల ద్వారా సేకరించి సకాలంలో ఆన్‌లైన్‌లో నమో దు చేయాలన్నారు. నారాయణపురం గ్రామ భూ సమస్య, నక్ష సర్వే, భూభారతి మొదలైన అంశాలపై కలెక్టర్ స్నేహశబరీష్ వివరించారు. కార్య క్రమంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, సర్వే ల్యాండ్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న, డిప్యూటీ డైరెక్టర్ సమీరా బేగం, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, మహబూబాబాద్ ఆర్డీఓ రాజేశ్వరి, కేసముద్రం తహసీల్దార్ వివేక్, మదన్ పాల్గొన్నారు.


