బతుకు బండిని
బాగు చేసుకుంటూ..
అన్నమాట కాదనలేక అర్ధరాత్రి వెళ్లిన రోహిత్
లింగాలఘణపురం : అన్న మాట కాదనలేక అర్ధరాత్రి ఇరవై కిలో మీటర్లు బైక్‌పై జాకీ తీసుకొచ్చిన తమ్ముడు.. రాత్రి వేళలో ఆపదలో ఉన్నారు.. లారీ ఆపుతున్నారు..ఆపు బావ..వారికి ఏ ఆపద ఉందో చూద్దామని వాహనం ఆపించి జాకీ ఇచ్చిన బావమరిది.. జీవన పోరాటంలో డ్రైవింగ్ చేసుకుంటూ మూడు నెలల క్రితమే మేనమరదలను వివాహం చే సుకుని పాడైన బండికి మరమ్మతు చేస్తున్న ఓ యు వకుడు.. ఇలా ముగ్గురు ఒకే చోట.. ఒకే రోడ్డు ప్ర మాదంలో మృత్యుఒడికి చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున జనగామ జిల్లా నెల్లుట్ల బ్రిడ్జి వద్ద హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఇసుక లారీ ముగ్గురిని బ లితీసుకుంది. ముందుగా ఓ యువకుడిని ఢీకొనడంతో అతను (రోహిత్), ఆ తర్వాత మరమ్మతు చే స్తున్న టాటాలేలాండ్ వాహనాన్ని ఢీకొట్టడంతో దా ని కింద ఉన్న మరో యువకుడు (డ్రైవర్ మహేశ్), లారీ ఎక్కేందుకు వెళ్తున్న ఇంకో యువకుడి (రాజేందర్)పై టాటాలేలాండ్ వాహనం పడడంతో అతను.. ఇలా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
సాయం చేద్దామని లారీని ఆపించిన రాజేందర్
డినికిని రాజేందర్(27), తన బావ మొగులగాని హరీశ్ స్వంత లారీలో ఇద్దరు కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం బయలు దేరారు. రోడ్డుపై చేయి అడ్డుపెట్టి వాహనాన్ని ఆపుతుండగా బావ ఆపు రాత్రి వేళలో వారికి ఏం ఆపద ఉందోనంటూ బలవంతంగా లారీ ఆపి జాకీ ఇచ్చాడు. సాయం చేయడమే అతని పాలిట శాపమైంది. పెద్దలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో టీవీలు, ఏసీలు మరమ్మతు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీని ఆపమనడమే అతడికి శాపమైంది.
మిన్నంటిన మృతుల బంధువుల రోదనలు
మృతుల బంధువుల రోదనలు ఆకాశాన్ని అంటా యి. తన తమ్మున్ని తానే చావుకు పిలిచినట్లైందని రోహిత్ అన్న దిలీప్, వద్దన్నా వినకుండా తన చావుకోసమే లారీని ఆపమన్నాడని రాజేందర్ బావ హ రీశ్, తమ కొడుకుకు మూడునెలల క్రితమే పెళ్లి చేశా .. అప్పడే నిండునూరేళ్లు నిండాయి.. మాకు.. న్యా యం చేయాలని మహేశ్ తల్లి పోలీసులను వేడుకుంటున్న తీరు అందరిని కంటతడి పెట్టిచింది.
టాటాలేలాండ్ వాహనం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకొనే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లికి చెందిన మహేశ్ అలియాస్ మధు(23) హైదరాబాద్‌కు కిరాయి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో వాహనం మరమ్మతుకు గురికావడంతో దానికింద పడుకొని జాకీ ఎక్కిస్తుండగా ప్రమాదం సంభవించింది. మూడు నెలల క్రితమే మేనమరదలను వివాహం చేసుకున్నాడు.
అన్న మాట కాదనలేక
అర్ధరాత్రి వచ్చి ఒకరు
సాయం చేద్దామని లారీ ఆపించి మరొకరు
బతుకు బండిని బాగు చేసే క్రమంలో ఇంకొకరు..
ఇలా.. ఒకే చోట జరిగిన
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
ఆస్పత్రి, పోలీసుస్టేషన్లలో మిన్నంటిన
బంధువుల ఆర్తనాదాలు
దేవరుప్పులలో కిరాణం షాపు నడుకుంటున్న మార్వాడీ దిలీప్ హైదరాబాద్ నుంచి టాటాలేలాండ్ వాహనంలో సామగ్రి తీసుకొస్తుండగా టైరు పంక్చర్ అయ్యింది. దీంతో జాకీ కోసం తమ్ముడు రోహిత్(22)కు ఫోన్ చేసి పిలిపించాడు. వెంటనే రోహిత్ రెండో ఆలోచన చేయకుండా బైక్‌పై జాకీ తీసుకొచ్చి వాహన మరమ్మతులో సహకరిస్తూ రోడ్డుపై వచ్చే వాహనాలకు ప్రమాదం ఉందని హెచ్చరిక చేస్తూ ఉండగా ఎదురుగా ఇసుకలారీ వచ్చి ఢీకొనడంతో చనిపోయాడు.


