వారం రోజుల్లోనే రెండు ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లోనే రెండు ప్రమాదాలు

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

జాతీయ రహదారులపై అధికార యంత్రాంగం ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తసుకుంటున్నా అతివేగం, అజాగ్రత్త, నిరంతరం విశ్రాంతి లేకుండా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. లింగాలఘణపురం మండల పరిధిలోని జనగామ– సూర్యాపేట, హైదరాబాద్‌– వరంగల్‌ జాతీయ రహదారుల్లో వారం రోజుల్లో రెండు ఘోర ప్రమాదాలు జరిగి ఆరుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ నెల 11న జనగామ –సూర్యాపేట హైవేలో నవాబుపేట మలుపు వద్ద అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో కాజీపేటకు చెందిన ఇమ్రాన్‌, సుభానీ, మాజీద్‌ ముగ్గురు మృతి చెందారు. అదేవిధంగా గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిలో నెల్లుట్ల బ్రిడ్డి సమీపంలో ఆగిఉన్న టాటాలేలాండ్‌ వాహనాన్ని ఇసుక లారీ ఢీకొనడంతో దేవరుప్పులకు చెందిన రోహిత్‌, గుండాల మండలం బండకొత్తపల్లికి చెందిన ననబాల మహేశ్‌ అలియాస్‌ మధు, మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడేనికి చెందిన రాజేందర్‌ దుర్మరణం చెందారు. దీనికి కారణం అతివేగం, నిద్రమత్తు, అర్ధరాత్రి ప్రయాణం చేయడమే కారణమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆరుగురి యువకుల దుర్మరణం

తల్లడిల్లుతున్న కుటుంబాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement