విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించాలి

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

కాశిబుగ్గ: మెడికల్‌ విద్యార్థులు విద్య, వైద్య పరిశోధన రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీ ఫోరెన్సిక్‌ విభాగం హెచ్‌ఓడీ బి.వి నాగమోహన్‌ అన్నారు. బుధవారం రాత్రి కాకతీయ మెడికల్‌ కళాశాల ఆవరణలో ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగంలో బదిలీ అయిన వారికి వీడ్కోలు, బాధ్యతలు స్వీకరించిన వారికి స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మెడిసిన్‌లో ప్రధాన ఫోరెన్సిక్‌ విభాగంలో పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు పరిశోధన రంగాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్‌ విభాగం నూతన హెచ్‌ఓడీగా బాధ్యతలు స్వీకరించిన ఖాజా మోయినోద్దీన్‌, వసంతకుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్లు నవీన్‌, అంబటి శ్రీనివాస్‌, సదాకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు,

బదిలీలు, బాధ్యత స్వీకరణలు..

కేఎంసీ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌రావు గాంధీ మెడికల్‌ కాలేజీకి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జె.సురేందర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల నర్సంపేటకు బదిలీ అయ్యారు. అలాగే, కాకతీయ మెడికల్‌ కళాశాలలో పనిచేస్తున్న ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం ప్రొఫెసర్‌ ఖాజామొయినుద్దీన్‌హెచ్‌ఓడీగా, కుత్బుల్లాపూర్‌ మెడికల్‌ కాలేజీ నుంచి బదిలీపై వచ్చిన డాక్టర్‌ వసంత్‌కు స్వాగతం పలికారు.

గాంధీ మెడికల్‌ కాలేజీ ఫోరెన్సిక్‌

హెచ్‌ఓడీ నాగమోహన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement