ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

కురవి/నెహ్రుసెంటర్‌: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన సీరోలు మండలం కొత్తూరు(సీ) శివారు గుజిలి తండా సమీపంలో చోటు చేసుకుంది. సీరోలు ఎస్సై సంతోష్‌ కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ మండలం గాంధీపురం గ్రామానికి చెందిన నర్సింగ రవి(45) బైక్‌పై బుధవారం రాత్రి మరిపెడ నుంచి మహబూబాబాద్‌ వెళ్తున్నాడు. సీరోలు మండలం కొత్తూరు(సీ) శివారు గుజిలి తండా సమీపంలో 365 జాతీయ రహదారి పక్కన జామాయిల్‌ కర్రల లోడ్‌తో ఎలాంటి సిగ్నల్‌ ఇవ్వకుండా ట్రాక్టర్‌ను రోడ్డుపై నిలిపారు. ఈ క్రమంలో రవి ఎదురుగా ఆగి ఉన్న ట్రాక్టర్‌కు ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్‌లో మహబూబాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సంతోష్‌ తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గురువారం పేర్కొన్నారు.

అండర్‌ బ్రిడ్జి వద్ద ధర్నా..

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మహబూబాబాద్‌ జనరల్‌ ఆస్పత్రి సమీపంలోని అండర్‌ బ్రిడ్జి వద్ద అంబులెన్స్‌ను ఆపి ధర్నా చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. పోలీసుల హామీతో నిరసన విరమించారు.

వ్యక్తి దుర్మరణం

గుజిలి తండా సమీపంలో ఘటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement