నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

మహబూబాబాద్‌: వానాకాలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల స్టాక్‌, సరఫరాపై నిఘా పెట్టాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచంద్రునాయక్‌ ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి అభివృద్ధి, వానాకాలం సీజన్‌, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచంద్రునాయక్‌ మాట్లాడుతూ పంట మార్పి డిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధి పనుల్లో పురోగతి ఉండాలన్నారు. మానుకోట ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్యా మురళీనాయక్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయాలన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నంబర్లు ఇవ్వాలన్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కె.అనిల్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, ఆర్డీఓలు రాజేశ్వరి, గణేష్‌ పాల్గొన్నారు.

పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి

ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement