నెహ్రూసెంటర్: సంఘాల పరిధిలోని చెరువులను లీజుకు ఇస్తే చర్యలు తప్పవని జిల్లా మత్స్యశాఖ అధికారి జర్పుల భాస్కర్ హెచ్చరించారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యపారిశ్రామిక సంఘాల సభ్యులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నియమాల ప్రకారం నడుచుకోవాలని, లీజుకు వెళ్తే సంఘం రద్దుకు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. చెరువుల కౌలు రకమును సకాలంలో చెల్లించాలని, చేపలు పట్టే అనుమతి పొందిన తర్వాత చెరువును లూటిని అడ్డుకోవచ్చన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు. జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్ మాట్లాడుతూ చెరువులోని మత్స్యసంపదను కాపాడుకో వాలని, మధ్య దళారులను నమ్మి లీజుకు ఇవ్వవద్దన్నారు. ఇటీవల జరిగిన చెరువుల లూటీపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రమోటర్స్ లింగాల పిచ్చయ్య, సింగాని అశోక్, జిల్లా మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్ దామోర శ్రీనివాస్, కోల రవి, భూముల గురుమూర్తి, సిబ్బంది విష్ణు, శ్రీపతి రాజు, శివశంకర్, వేణు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్


