పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

Jun 16 2026 1:16 AM | Updated on Jun 16 2026 1:16 AM

మహబూబాబాద్‌: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనందున పాఠశాలలపై విద్యాశాఖ, మున్సిపల్‌, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిబంధనల ప్రకారం అర్హులకు తక్షణమే న్యాయం చేయాలన్నారు. అఽధికారులు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పాఠఽశాలల్లో తాగునీరు, విద్యుత్‌సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు అందజేయాలన్నారు. నాణ్యమైన భోజన పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు బాధ్యతగా పని చేయాలన్నారు. ప్రజావాణిలో 215 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసి వినతి అందజేశారు. ధరలులు నియంత్రించాలని, రేషన్‌షాపుల్లో 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని వినతిలో పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు అనిల్‌కుమార్‌, పురుషోత్తం, జిల్లా అధికారులు ఉన్నారు.

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

ప్రజావాణిలో 215 వినతులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement