కొత్తగూడ: మండలంలోని వేలుబెల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 77 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఒక్క గది మాత్రమే ఉన్నది. బడిని మన ఊరు–మన పాఠశాల పథకంలో ఎంపిక చేసి అదనపు తరగతి గదులు, మంచి నీటి వసతి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. అయితే మూడేళ్లు అయినా పనులు మాత్రం పూర్తి కాలేదు. కాంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తే చేసిన పనులకు బిల్లులు రాలేదని, వస్తేనే మిగిలిన పనులు చేస్తానని చెప్పాడు. కాగా ఈ విద్యాసంవత్సరం కూడా విద్యార్థులు చెట్లకిందనే పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది.


