భలేగుంది.. వేస్ట్‌ ఆయిల్‌ బట్టి | - | Sakshi
Sakshi News home page

భలేగుంది.. వేస్ట్‌ ఆయిల్‌ బట్టి

Apr 24 2026 6:02 AM | Updated on Apr 24 2026 6:02 AM

ఎంజీఎం వద్ద మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, ధర్మారెడ్డి, వినయ్‌భాస్కర్‌, నరేందర్‌

ఎంజీఎం వద్ద ఆర్టీసీ నాయకులు

కేసముద్రం: ప్రస్తుతం గ్యాస్‌ కొరతతో అనేక మంది చిరువ్యాపారుల జీవనం ఆగమ్యగోచరంగా మారింది. బ్లాక్‌లో కూడా లభించని స్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఓ చిరువ్యాపారికి యూ ట్యూబ్‌లో వచ్చిన వీడియో కలిసొచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మున్సిపాలిటీ పరిఽ ది సబ్‌స్టేషన్‌తండాకు చెందిన వాంకుడోత్‌ బిచ్యానా యక్‌.. మోహన్‌ థియేటర్‌ సమీపంలో క్యాంటీన్‌ నడుపుతున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా గ్యాస్‌ కొర త ఏర్పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో బిచ్యానా యక్‌ కుమారుడు అభిరామ్‌ యూట్యూబ్‌లో సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి ఇనుప స్టాండ్‌తో ఏర్పాటు చేసిన వేస్ట్‌ ఆయిల్‌ బట్టి(డీజిల్‌ బట్టి)ని తయారు చేసి, అది పని చేసే విధానం చూసి తన తండ్రికి తెలిపాడు. ఇటీవల సిరిసిల్ల వెళ్లి ఆ వేస్ట్‌ ఆయిల్‌తో నడిచే బట్టిని, గాలి పంకను సుమారు రూ.13వేలకు ఖరీదు చేసి తీసుకొచ్చా రు. విద్యుత్‌ కనెక్షన్‌ ద్వారా పంక తిరుగుతూ ఒక గొట్టం ద్వా రా గాలి, పైనున్న ఇనుప డబ్బాలో పోసిన వేస్ట్‌ ఆయిల్‌ టాప్‌ నుంచి మరో గొట్టం నుంచి బ ట్టి వరకు సరఫరా అవుతుంది. అప్పటికే బట్టిని వెలిగించడంతో వేస్ట్‌ ఆయిల్‌ మండుతూ ఆ మంట కు గాలి తాకుతుండడంతో గ్యాస్‌ స్టౌవ్‌ మాదిరి ఎక్కు వ మంట వస్తుంది. దీంతో ఆ బట్టిపై మూకుడు పెట్టి ఆహర పదార్థాలను తయారుచేస్తున్నారు. లీటర్‌ వేస్ట్‌ ఆయిల్‌ 2 గంటల పాటు మంట వస్తుందని, కేవలం రూ.30కే (వాహనాల్లో వాడే ఇంజన్‌ ఆయిల్‌) కొనుగోలు చేస్తామని ఆ చిరువ్యాపారి తెలిపారు. రోజుకు వేస్ట్‌ ఆయిల్‌కు రూ.80 వరకే ఖర్చు వస్తుందన్నారు. ఈ బట్టిలో డీజిల్‌ గాని వేస్ట్‌ ఆయిల్‌ గాని వాడొచ్చని తెలిపారు. అదే సిలిండర్‌ అయితే 3 రోజులకే గ్యాస్‌ అయిపోతుందని, దీంతో రూ. వెయ్యి ఖర్చు వస్తుందని తెలిపారు. ప్రస్తు తం తక్కువ ఖర్చుతో వ్యాపారం కొనసాగిస్తున్నామని, ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది.

గ్యాస్‌ కొరతతో బట్టి ఏర్పాటు

తక్కువ ఖర్చు వస్తుండడంతో

చిరువ్యాపారి ఆనందం

Advertisement
 
Advertisement
Advertisement