కురవి: ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి ఆమె మృతికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ గురువారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఈనెల 14న మండలానికి చెందిన ఓ బాలిక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ 18న మృతి చెందింది. తన మరణానికి ముందు బాలిక ఇచ్చిన వాంగ్మూలంలో బానోత్ కిరణ్ అనే కారణమని పేర్కొనడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో నిందితుడు బాలికకు బంధువే(చెల్లి వరుస) అయినా మారుపేర్లతో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా పరిచయం పెంచుకుని తాను మల్లారెడ్డి కాలేజీ విద్యార్థి అని నమ్మించి ప్రేమపేరుతో మోసం చేసినట్లు తేలింది. కానీ అప్పటికే వివాహ మై ఇద్దరు పిల్లలు ఉన్న విష యం దాచిపెట్టినట్లు, నిందితుడు వరుసకు అన్నయ్య అవుతాడని తెలిసిన తర్వాత బాలిక అతడిని దూరం పెట్టేందుకు యత్నించింది. దీంతో నిందితుడు తన ద గ్గర ఉన్న ఆడియో రికార్డింగ్ బయటపెడతానని బెదిరించగా ఒత్తిడి తట్టుకోలేక బాలిక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై చెప్పారు. కాగా, నిందితుడు గతంలో కూడా తాను లాయర్ అని చెప్పి భద్రాద్రి కొతగూడెం జిల్లాకు సంబంధించి పోక్సో కేసులో శిక్ష పడిన ఓ నిందితుడికి హైకోర్టులో బెయిల్ ఇప్పిస్తా అని సుమారు రూ.12లక్షలు తీసుకున్నట్లు, అలాగే, భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు సంబంధించి చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడికి ప్రమేయం ఉన్నట్లు తేలినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు.
బాలిక ఆత్మహత్యాయత్నం..
చికిత్స పొందుతూ మృతి
ఈ ఘటనలో వ్యక్తి అరెస్ట్, రిమాండ్
వివరాలు వెల్లడించిన పోలీసులు


