నియోజకవర్గ అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ అర్బన్: మానుకోట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని 1, 30, 31, 34 వార్డుల్లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో మానుకోట సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా రూ. 60 కోట్ల నిధులు కేటాయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లా కేంద్రంలోని 36వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయినేజీలు నూతనంగా నిర్మిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని, మానుకోట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


