రద్దీగా రైళ్లు..
డోర్నకల్: సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలో సికింద్రాబాద్ వైపు వెళ్లే రళ్లు రద్దీగా నడుస్తున్నాయి. విజయవాడ నుంచి డోర్నకల్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్తున్న శాతవాహన, గోల్కొండ, కృష్ణా, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌తో పాటు వివిధ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు రైళ్లలో రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
గ్రామీణ ప్రాంత రోడ్ల
అభివృద్ధికి కృషి
కురవి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. మండలంలోని బలపాల గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్డును ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు సౌకర్యం మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమవుతుందని అన్నారు. బలపాల గ్రామ ప్రజలకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం గ్రామా ల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాబో యే రోజుల్లో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలా గే గ్రామంలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కాగా దేపనంగి మదార్, భద్రమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు దేపనంగి బిక్షం–మహాలక్ష్మి ప్రాథమిక పాఠశాలకు ఎమ్మెల్యే సమక్షంలో ఆట వస్తువులు, గేట్‌ను బహూకరించారు. హెచ్‌ఎం సునీత, చైర్మన్లు ఇస్లావత్ సుధాకర్, కొర్ను రవీందర్‌రెడ్డి, సర్పంచ్ బిక్కు నాయక్, కాంగ్రెస్ డోర్నకల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ్ల రజనీకాంత్, వెంకటనారాయణ, హరిలాల్ పాల్గొన్నారు.
పాఠశాలల్లో హౌస్ సిస్టం, స్టూడెంట్ కౌన్సిళ్లు
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో హౌస్ సిస్టం, స్టూడెంట్ కౌన్సిళ్ల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఒక్కో స్కూల్‌కు రూ.6,250 చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో స్టూడెంట్ కౌన్సిల్‌కు అవసరమయ్యే బ్లేజర్లు, సాక్సులు, షూ, బ్యాడ్జీల వంటి సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. హనుమకొండ జిల్లాలోని 188 పాఠశాలలకు రూ.11,75,000, వరంగల్ జిల్లాలోని 197 పాఠశాలలకు రూ.12,31,250, మహబూబాబాద్ జిల్లాలోని 227 పాఠశాలలకు రూ.14,18,750, జనగామ జిల్లాలోని 174 పాఠశాలలకు రూ.10,87,500, ములుగు జిల్లాలోని 90 పాఠశాలలకు రూ.5,62,500, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 125 పాఠశాలలకు రూ.7,81,250 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
రద్దీగా రైళ్లు..


