వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

Jul 28 2025 12:10 PM | Updated on Jul 28 2025 12:10 PM

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

వరంగల్‌ స్పోర్ట్స్‌ : వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ధృడసంకల్పంతో ముందుకు సాగుతున్నామని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా అమ్యోచూర్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో యోనెక్స్‌ సన్‌రైజ్‌ 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్‌–17 బాలబాలికల షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు ముగిశాయి. ఆదివారం ముగింపు పోటీల వేడుకలు హనుమకొండ సుబేదారిలోని వరంగల్‌ క్లబ్‌ వేదికగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హాజరై విజేతలకు ట్రోఫీ, పతకాలు, సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్య, వైద్యరంగాల్లో అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ మహానగరాన్ని ఇప్పుడు క్రీడా రంగంలోనూ తీర్చిదిద్దేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నగర శివారులో స్పోర్ట్స్‌ స్కూల్‌తో పాటు క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మహబూబాబాద్‌ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ మూల జితేందర్‌రెడ్డి, కొమ్ము రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ..మూడ్రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు, కోచ్‌, మేనేజర్లు పాల్గొన్నారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు డిసెంబర్‌ మొదటి వారంలో భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీసాయిహర్షిత్‌, అంకిత్‌కుమార్‌, డీసీపీ పుల్లా శోభన్‌కుమార్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు సీఎం శశిధర్‌, వరంగల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.రమేష్‌కుమార్‌, కార్యదర్శి డాక్టర్‌ పింగిళి రమేష్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్‌, వద్దిరాజు వెంకటేశ్వర్లు, మనోజ్‌రావు, టోర్నమెంట్‌ పరిశీలకుడు బాబు, విజయ్‌, అమరలింగేశ్వర్‌రావు, కిరణ్‌, హనుమంతరావు పాల్గొన్నారు.

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

విజేతలు..

బాలుర సింగిల్స్‌ విభాగంలో శశాంక్‌ వనమాల (నల్లగొండ) గెలుపొందాడు. బాలికల సింగిల్స్‌ విభాగంలో సరయు సూర్యనేని (హైదరాబాద్‌)విజేతగా నిలిచింది. బాలికల డబుల్స్‌ కేటగిరీలో శ్రీదేవికా ఆదిష్య (సంగారెడ్డి), వై.శృతి(సంగారెడ్డి) జట్టు విజయం సాధించింది. బాలుర డబుల్స్‌ కేటగిరీలో బూడిద తనీష్‌రెడ్డి(రంగారెడ్డి), తన్మయినిహాల్‌ ఉత్తమ్‌ (కరీంనగర్‌) జోడీ గెలుపొందింది.మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ కేటగిరీలో ఎస్‌.అఖిలేష్‌ గౌడ్‌(నల్లగొండ), బి.రిత్వికశ్రీ (భద్రాద్రి కొత్తగూడెం) జట్టు విజేతగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement