
భీమునిపాద జలపాతంలో పర్యాటకుల సందడి
గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపంలోని భీమునిపాద జలపాతంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలకు భీమునిపాద జలపాతం కనువిందు చేస్తోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్ జిల్లా నుంచి కార్లు, ఆటోలు, బస్సులో పర్యాటకులు జలపాతం వద్దకు చేరుకున్నారు. పర్యాటక కేంద్రమైన భీమునిపాద జలపాత ప్రాంతంలో అటవీ శాఖ ఇటీవల వసతులు, కాటేజీలు నిర్మించారు.కనువిందు చేస్తున్న జలపాతాన్ని తిలకిస్తూ, స్నానమాచరిస్తు పర్యాటకులు కేరింతలతో సందడి చేశారు.