
మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
డిప్యుటేషన్ వైద్యులతో
గార్ల సీహెచ్‌సీలో
అరకొర వైద్యం
● విధులకు సక్రమంగా హాజరు
కాకపోవడంతో రోగుల ఇబ్బందులు
● రాత్రి సమయంలో ఉండని డాక్టర్లు
● పట్టించుకోని ఉన్నతాధికారులు
● నిరుపయోగంగా
అత్యాధునిక పరికరాలు
గార్ల: గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను సకల సౌకర్యాలతో నిర్మించారు. అయితే డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లు సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగానే మారింది. గత సర్కారు హయాంలో రూ.5కోట్లు వెచ్చించి 30 పడకల ఆస్పత్రిని నిర్మించారు. నాటి నుంచి వైద్యులు డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. వారానికి రెండు రోజులు మాత్ర మే విధులు హాజరవుతున్నారు. అదికూడా ఒకపూట మాత్రమే వచ్చి వెళ్తున్నారు. రాత్రి సమయంలో అత్యవసర వైద్యచికిత్స కోసం ఎవరైనా వస్తే విధుల్లో ఒక్క డాక్టర్ ఉండడం లేదు. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు.
గతేడాది..
గత ఏడాది స్పెషలిస్ట్ వైద్యులకు ప్రభుత్వం కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టడంతో డాక్టర్లు అంతా వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. ఆన్‌లైన్‌లో గార్ల ఆస్పత్రి పేరు లేకపోవడంతో ఇక్కడికి ఎవరూ రాలేదు. పలుమార్లు దిన పత్రికల్లో వరుస కథనాలు రావడం, అఖిలపక్ష నాయకుల ఆందోళనలు చేపట్టడంతో కలెక్టర్, డీసీహెచ్‌ఎస్ స్పందించి తొర్రూరు, గూడూ రు ఆస్పత్రుల నుంచి డిప్యుటేషన్‌పై నలుగురు డాక్లర్లును ఇక్కడికి రప్పించారు. డిప్యుటేషన్‌పై విధుల్లో చేరిన డాక్టర్లలో ఒకరు లాంగ్‌లీవ్ పెట్టగా, మరో ముగ్గురు షిఫ్ట్ పద్ధతిలో వారానికి రెండు రోజులు మాత్రమే వచ్చి, ఒక పూట విధులు నిర్వహించి వెళ్తున్నారు.
అత్యాధునిక పరికరాలు.. నిరుపయోగం
ఆస్పత్రిలో ఎక్స్‌రే గది, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఆక్సిజన్ ప్లాంట్, వెంటిలేటర్ బాక్స్‌లు, ఫొటోథెరఫీ బాక్స్, స్టెరిలైజేషన్ మిషన్, ఆక్సీకాన్సన్‌ట్రేటర్లు, తదితర వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. అవి నిరుపయోగంగా మారాయి. కాగా వైద్యులను నియమించడంలో పాలకులు, అధికారులు వైఫల్య ం చెందారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా వైద్యాధికారులు స్పందించి గార్ల సీహెచ్‌సీ ఆస్పత్రిలో పూర్తిస్థాయి రెగ్యులర్ వైద్యులను నియమించి మండల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.
నిరుపయోగంగా
వైద్య పరికరాలు
న్యూస్‌రీల్

మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025