
‘జేఈఈ మెయిన్స్’ ఆణిముత్యాలు
జేఈఈలో ఇరువురికి ర్యాంకులు
భూపాలపల్లి అర్బన్ : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పలువురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. పట్టణానికి చెందిన తాళ్ల నిహారిక ఆల్ ఇండియా 15,625 ర్యాంక్, (93 పర్సంటైల్) సాధించగా, గుగులోత్ జ్ఞానేశ్వర్ 72వేల ర్యాంకు, (95 పర్సంటైల్) సాధించారు.
దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మే లో జరిగే అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత పొందారు. ఈ క్రమంలో జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాలను శుక్రవారం రాత్రి పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అర్హత పొందిన విద్యార్థుల వివరాలు..
మాణిక్యాలు.. మానుకోట విద్యార్థులు
మహబూబాబాద్ అర్బన్ : జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మానుకోటకు చెందిన ఉమ్మగాని మధు–కృష్ణవేణి కుమారుడు విశిస్ట్ గౌడ్ ఆల్ ఇండియా 7, 300 ర్యాంక్ సాధించాడు. జేఈఈలో విశిస్ట్ మంచి ర్యాంక్ రావడంతో మార్గదర్శి బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమ్మగాని అరుణ్‌కుమార్, బంధుమిత్రులు హార్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వ చీఫ్ ఇంజనీయర్‌గా ఉద్యోగ సాధిస్తానని విశిస్ట్ వివరించాడు.
మానుకోటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బ్రాహ్మణపల్లి శ్రీనివాస్–సువర్ణ దంపతుల కుమారుడు హనీష్ జేఈఈ ఫలితాల్లో ఆల్ ఇండియా 3,553 ర్యాంక్ సాధించాడు. భవిష్యత్‌లో ఐఐటీ కంప్యూటర్ సైన్స్‌లో సీటు సాధించి, సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్ కావాలని, విదేశాలలో ఉద్యోగం చేయాలని హనీష్ తెలిపాడు.
సత్తా చాటిన సాగర్
రఘునాథపల్లి : మండలంలోని వెల్ది మోడల్ స్కూల్/కళాశాల విద్యార్థి మనుపాటి సాగర్ జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ సాధించాడు. మండల కేంద్రానికి చెందిన మనుపాటి ఎల్లయ్య–శారద కుమారుడు సాగర్ జాతీయస్థాయిలో 7,626 ర్యాంకు సాధించి, జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించాడు. శనివారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పి.శ్రీధర్‌తో పాటు తల్లిదండ్రులు సాగర్‌ను అభినందించి, హర్షం వ్యక్తం చేశారు. కా ర్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్, మల్లం శ్రీధర్, రాజు, మోహన్‌రావు, శ్రీను, రవి, సౌజన్య, ప్రియ, రుద్రమదేవి, విజయ, శశికుమారి తదితరులు పాల్గొన్నారు.
మెరిసిన ‘ఏకలవ్యులు’..
కురవి : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్ లాలు శనివారం తెలిపారు. కళాశాలకు చెందిన బి.వినీత (85.65), బి.దీపిక (59.46), జి.సోనియా (57.84), బి.సింధు (54.93), కె.ప్రియదర్శిని(52.37) పర్సంటైల్‌తో జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అర్హత సాధించారు.
అర్జున్ అత్యుత్తమ ప్రతిభ
దేవరుప్పుల : జేఈఈ మెయిన్ ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన బిట్ల అర్జున్ 16,816 ర్యాంకు (97.07 పర్సంటైల్) సాధించాడు. మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిషు మీడియం హైస్కూల్‌లో తొమ్మిది వరకు, ఆపై హైదరాబాద్‌లో చదివాడు. నిట్‌లో అనుకున్న సీటు లభిస్తుందని అర్జున్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘జేఈఈ మెయిన్స్’ ఆణిముత్యాలు

‘జేఈఈ మెయిన్స్’ ఆణిముత్యాలు

‘జేఈఈ మెయిన్స్’ ఆణిముత్యాలు

‘జేఈఈ మెయిన్స్’ ఆణిముత్యాలు

‘జేఈఈ మెయిన్స్’ ఆణిముత్యాలు

‘జేఈఈ మెయిన్స్’ ఆణిముత్యాలు