శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 10లోu
‘ఈ ఫొటోలో బస్సు ఎక్కుతున్న ప్రయాణికులది గూడూరు మండలం భూపతిపేట గ్రామం. అటు మహబూబాబాద్, ఇటు వరంగల్, నర్సంపేట, గూడూ రు వెళ్లే ప్రయాణికులు రోడ్డు పక్కన ఉన్న చెట్ల నీడలో ఉండి బస్సు రాగానే ఎక్కుతున్నారు. ఎక్కువ మంది ఉంటే చెట్టు నీడ సరిపోక.. ఎండలో రోడ్డుపై నిలబడి బస్సు ఎక్కాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.’
‘ఈ ఫొటోలు కనిపిస్తున్నది కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని జ్యోతిరావుపూలే సెంటర్. ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్టాండ్ కిలోమీటరు దూరంలో ఉంది. వరంగల్ వెళ్లే ప్రయాణికులు ఈ సెంటర్‌లో బస్సు ఎక్కుతారు. అయితే ఈ సెంటర్‌లో ప్రయాణికుల కోసం కనీసం బస్‌షెల్టర్ లేదు. ఎండలో కూర్చుంటేనే బస్సు ఎక్కడం.. బస్టాండ్ ఉన్నప్పటికీ అక్కడ కనీస సౌకర్యాలు లేవు.’
సాక్షి, మహబూబాబాద్: జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఆస్టీసీ బస్‌షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం రోడ్డుపైనే నిల్చొని గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి గజగజ వణుకుతూ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో సమీపంలోని చెట్లు, దుకాణాలే ప్రయాణికులకు బస్‌షెల్టర్లుగా మారుతున్నాయి. ఈమేరకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలోని ప్రధాన సెంటర్ల వద్ద బస్‌షెల్ట ర్లు లేక ప్రయాణికులు పడుతున్న అవస్థలపై ‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.’
జిల్లా కేంద్రంలో..
మానుకోట పట్టణంలో ఆర్టీసీ బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు కోసం ఎండలోనే నిల్చొని వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రం నుంచి తొర్రూరు, నర్సంపేట, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా జిల్లా కేంద్రంలోని మదర్‌థెరిస్సా సెంటర్, కురవిగేట్, తొర్రూరు బస్టాండ్ సెంటర్, మూడుకొట్ల సెంటర్ల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ఎండలోనే ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. తొర్రూరు బస్టాండ్ సెంటర్‌లో చిన్నపాటి బస్‌షెల ్టర్ ఏర్పాటు చేసినప్పటికీ అది సరిపోక ప్రయాణికులు చెట్లకింద, షాపుల వద్ద ఉంటూ బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.
ఎవరికి పట్టని షెల్టర్లు..
బస్టాండ్, బస్ షెల్టర్ల గురించి ఆలోచించి రోడ్ల నిర్మాణాలు చేపట్టాలి. అయితే కొన్ని సంవత్సరాలుగా ఇది జరగడం లేదు. పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద మున్సిపల్‌శాఖ బస్ షెల్టర్లు నిర్మించాలి. అదే విధంగా గ్రామాలు, మండలాల్లో గ్రామ పంచాయతీ అధ్వర్యంలో, జాతీయ రహదారి వెంట హైవే అథారిటీ వారు నిర్మించాలి. కానీ బస్టాండ్ తప్ప.. జిల్లాలో ఎక్కడ కూడా ప్రయాణికులకోసం షెల్టర్లు నిర్మించడం లేదు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి 65 బస్సులు, 30 రూట్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ప్రతీరోజు సుమారు 34 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025


