గంటల తరబడి ఎండలోనే..
ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ఎండలోనే గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. సరైన నీడ కూడా లేదు. ప్రయాణికులు కూర్చునేందుకు షెడ్‌లు ఏర్పాటు చేయాలి. ప్రయాణికులకు కనీస సౌకర్యాలను కల్పించాలి. తొర్రూరు బస్టాండ్ సెంటర్‌లో ఉన్న షెడ్‌లో కొంత మంది ప్రయాణికులు కూర్చుకునేందుకే వీలుంది.
– శోభ, రాజులకొత్తపల్లి
తాగేందుకు మంచినీరు కూడా లేదు
ఊరెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌కు రాగా ఎండల తీవ్రత వల్ల బాగా దాహం అవుతుంది. బస్సు ఎక్కేందుకు వచ్చిన వారికి కనీసం తాగేందుకు మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదు. బస్సులు కూడా తొందరగా రావడం లేదు. గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. మంచినీటితో పాటు కూసునేందుకు నీడ ఏర్పాటు చేశారు.
– సూరయ్య, తాళ్లపూసపల్లి
షెడ్డు ఏర్పాటు చేయాలి
జిల్లా కేంద్రంలోని కురవిగేట్ వద్ద ప్రయాణికుల కోసం ఒక షెడ్డు ఉండేది. దానిని కూడా ఇక్కడ నుంచి తీసేశారు. బస్సు కోసం ఎండలోనే ఉండాల్సి వస్తుంది. కురవి, డోర్నకల్, ఖమ్మం ప్రాంతాలకు ఇక్కడ నుంచే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు వెళ్తారు. కురవిగేట్ వద్ద ప్రయాణికుల కోసం షెడ్డును ఏర్పాటు చేయాలి. అలాగే తాగునీటి సదుపాయం కల్పించాలి.
– రమేశ్, సాలార్‌తండా
బస్ షెల్టర్ లేక ఇబ్బందులు
భూపతిపేట బస్టాండ్ వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్ల వద్ద నిలబడి బస్సు రాగానే పరుగెత్తి ఎక్కాల్సి వస్తుంది. నర్సంపేట కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు పెద్ద వారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న బస్ షెల్టర్ రోడ్డు వెడల్పులో కనిపించకుండా పోయింది. బస్ షెల్టర్ నిర్మించాల్సిన అవసరం ఉంది.
– ఆకుల రమేశ్, సీతానగరం, గూడూరు మండలం
●
గంటల తరబడి ఎండలోనే..
గంటల తరబడి ఎండలోనే..
గంటల తరబడి ఎండలోనే..


