నేడు ‘పాలిసెట్‌’ | Sakshi
Sakshi News home page

నేడు ‘పాలిసెట్‌’

Published Fri, May 24 2024 9:55 AM

నేడు

మహబూబాబాద్‌ అర్బన్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు శుక్రవారం పాలిసెట్‌–2024 పరీక్ష నిర్వహించనున్నట్లు వరంగల్‌ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డి.శోభారాణి గురువారం తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. నిమిషం ఆలస్యమైనా సెంటర్‌లోకి అనుమతి ఉండదని, పరీక్షకు గంట ముందే హాజరుకావాలన్నారు. మానుకోట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తక్షశిల హైస్కూల్‌, ప్రభుత్వ బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలిక జూనియర్‌ కళాశాల, శ్రీచైతన్య టెక్నోస్కూల్‌, ప్రభుత్వ బాలుర పాఠశాలలోని పరీక్ష కేంద్రాల్లో 1,605 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకురావొద్దని సూచించారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి

నెహ్రూసెంటర్‌: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌, ప్రధాన కార్యదర్శి రుక్ముద్దీన్‌ అన్నారు. డీఎంహెచ్‌ఓ కళావతిబాయికి గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేతనాలు రాకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరగనున్న సమ్మెకు మద్దతు ఇస్తూ నోటీసు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ కార్యవర్గ సభ్యులు సంజీవ్‌నాయక్‌, ఎల్‌.కరుణాకర్‌, రఘునాఽథ్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి ఇంటర్‌

సప్లిమెంటరీ పరీక్షలు

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని డీఐఈఓ సమ్మెట సత్యనారాయణ గురువారం తెలిపారు. ఉదయం 9గంటలకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30గంటలకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలోని మొత్తం 16కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, కేంద్రానికి 30నిమిషాల ముందే హాజరుకావాలని సూచించారు. మొదటి సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 2,043, ఒకేషనల్‌ విద్యార్థులు 531మంది హాజరవుతారన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 1038, ఒకేషనల్‌ విద్యార్థులు 898మంది పరీక్షలు రాస్తారని చెప్పారు.

జ్వరాల బారిన పడకుండా

జాగ్రత్తలు పాటించాలి

నెహ్రూసెంటర్‌: ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ప్రోగ్రాం ఆఫీసర్‌ సుధీర్‌రెడ్డి, పీహెచ్‌సీ వైద్యాధికారి విజయ్‌కుమార్‌ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్‌ సబ్‌సెంటర్‌, వడ్డెర కాలనీలో ప్రజలకు రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో మలేరియా కేసులు నమోదు కావడంతో ఆ ఏరియాలోని 98మందికి రక్త పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రక్త పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు వెంటనే వైద్య చికిత్స చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీఎంఓ డాక్టర్‌ నర్మద, హెచ్‌ఈఓ పురుషోత్తం, ఆరోగ్య విస్తరణ అధికారి ఒబిలిశెట్టి రామకృష్ణ, హెల్త్‌ అసిస్టెంట్‌ రాజేందర్‌, లింగారెడ్డి, రవి, దీన దయావతి, ఆశ్విని, కళావతి, శారద, మమత, మాధవి, మహేశ్వరి, రాధాబాయి, విజయ పాల్గొన్నారు.

కాళేశ్వరంలో గోదావరి హారతి

కాళేశ్వరం: కాళేశ్వరంలో గురువారం గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దేవస్థానం నుంచి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో గోదావరి నది వద్దకు కాలినడకన వెళ్లారు. ప్రధాన అర్చకులు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చక స్వాములు ప్రత్యేక పూజాకార్యక్రమాలతో గోదావరి నదీ హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆలయ సూపరింటెండెంట్‌ బుర్రి శ్రీని వాస్‌, సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు, సేవాసమితి, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

నేడు ‘పాలిసెట్‌’
1/2

నేడు ‘పాలిసెట్‌’

నేడు ‘పాలిసెట్‌’
2/2

నేడు ‘పాలిసెట్‌’

Advertisement
 
Advertisement
 
Advertisement