
ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ అనుచరులు
కేసముద్రం: వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా సభావేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ ఫొటో లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. సోమవారం కేసముద్రం మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారంలో భాగంగా సభావేదికపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం అందులో రెడ్యానాయక్ ఫొటో లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. చివరకు రెడ్యానాయక్ ఫొటో ఫ్లెక్సీని సభావేదికపై ఏర్పాటు చేయడంతో ఆందోళన విరమించారు. అనంతరం మార్కెట్ చైర్‌పర్సన్‌గా నీలం సుహాసిని, వైస్ చైర్మన్‌గా రవి, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి సత్యవతిరాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రమోహన్, జెడ్పీటీసీ శ్రీనాథ్‌రెడ్డి, గాయత్రి గ్రానై ట్ అధినేత వద్దిరాజు కిషన్, డీఎంఓ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ బట్టు శ్రీనివాస్, నీలం దుర్గేష్, సొసైటీ చైర్మన్ దికొండ వెంకన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రెడ్యానాయక్
ఫొటో లేకపోవడంతో ఆందోళన
ఫొటో ఏర్పాటుతో సద్దుమణిగిన వివాదం