నియోజకవర్గ కేంద్రాల్లో స్ట్రాంగ్‌ రూమ్స్‌ | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ కేంద్రాల్లో స్ట్రాంగ్‌ రూమ్స్‌

Oct 7 2026 12:58 AM | Updated on Oct 7 2026 12:58 AM

నియోజకవర్గ కేంద్రాల్లో స్ట్రాంగ్‌ రూమ్స్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ ●

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ సెంటర్స్‌, స్ట్రాంగ్‌ రూమ్స్‌, కౌంటింగ్‌ కేంద్రాలు, మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందిచిన ఒక ఫార్మట్‌లో వివరాలను సేకరించాం. బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌కు సంబంధించి చర్యలు చేపట్టాం.

– ఆర్‌ సుధాకర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను దాదాపు పూర్తి చేశాం. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఓటరు జాబితా ప్రచురణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు తదితర కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేశాం. అలాగే ఎన్నికల్లో పాల్గొనే క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణ ఇప్పించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నాం. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి కూడా దాదాపు వచ్చేసింది.

– జీ భాస్కర్‌, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement