13న ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

13న ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని కర్నూలులోని విద్యుత్‌ భవన్‌ ప్రాంగణంలో ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్‌పీడీసీఎల్‌ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌, కర్నూలు టౌన్‌ ఈఈ మహేష్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

లేపాక్షిలో డిస్కౌంట్‌ అమ్మకాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలోని లేపాక్షి హాండీక్రాప్ట్‌ ఎంపోరియంలో ఈ నెల 11 నుంచి డిస్కౌంటు అమ్మకాలు జరుగుతాయని మేనేజర్‌ తిమ్మయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల వస్తువులపై 10 శాతం, ఎంపిక చేసిన వస్తువులపై 40 శాతం వరకు డిస్కౌంటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశం జనవరి 13 వరకు ఉంటుందని, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

స్థానిక ఎన్నికలకు

సిద్ధంగా ఉండాలి

కర్నూలు (అర్బన్‌): జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని జిల్లాపరిషత్‌ సీఈఓ ఆర్‌.సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో జిల్లాలోని ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, మహిళలను గ్రామ పంచాయతీ వారీగా డిసెండింగ్‌ ఆర్డర్‌ ప్రకారం ఫార్మాట్‌లో పొందుపరిచామన్నారు. అలాగే బీసీ ఓటర్ల జాబితాను కూడా రూపొందించడం జరిగిందని చెప్పారు. రూపొందించిన ఫార్మాట్లలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో డీడీఓలు అశ్వినికుమార్‌, శివశంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement