నేను 2018లో ఐటీఐ ఎలక్ట్రీషియన్ పూర్తి చేశా. ఉన్నత చదువులు, ఉద్యోగానికి వెళ్లకుండా నా తండ్రి కిషోర్ శర్మ బాటలోనే వారసత్వంగా పౌరోహిత్యం తీసుకున్నాను. ప్రస్తుతం కమ్మవారిపల్లెలోని రామాలయంలో అర్చకునిగా ఉన్నా. ఆలయాల ప్రతిష్ట, వివాహాలు, గృహ ప్రవేశాల తదితర శుభకార్యాలు చేస్తున్నా. మా పెద్దల నుంచి వస్తున్న ఆచారాలను కొనసాగిస్తున్నా. దేవునికి సేవ చేసే భాగ్యం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. – చింతకుంట సుధీర్,
తిమ్మనాయినపేట, కొలిమిగుండ్ల మండలం


