న్యూస్‌రీల్
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. IIలోu
● ఉన్నత చదువులు అభ్యసించినా వేద విద్య ౖవైపు అడుగులు ● అర్చకులుగా, పురోహితులుగా రాణిస్తున్న యువత
ఆదివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
మహానందిలో సుప్రభాతం చదువుతున్న మామిళ్లపల్లి వెంకట ఆంజనేయ రఘుశర్మ 2011లో ఎంఏ పూర్తి చేశారు. తర్వాత టీపీటీ, యూజీసీ నెట్ చదివారు. కొన్నేళ్లు కర్నూలు, నంద్యాల పట్టణాల్లో ప్రైవేట్ కళాశాలల్లో లెక్చరర్‌గా చేస్తూ నెలకు రూ. 30 నుంచి రూ. 40వేల వరకు వేతనం తీసుకున్నారు. పెళ్లి చేసుకుని పిల్లలతో గడుపుతున్నా ఏదో ఒక వెలితి. తాత, బాబాయిలు దేవుడి సేవలో చేస్తుంటే తాను ఎందుకు ఇలా అధ్యాపకుడిగా ఉండాలని అర్చక వృత్తిలోకి వచ్చారు. ప్రవేశ, వర, ప్రవర పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి మహానందీశ్వర స్వామి సేవలో తరిస్తున్నారు. నిత్యం మహానందీశ్వరస్వామిని చూస్తుండటం, మనసారా చేతులతో తాకే అవకాశం రావడం తనకెంతో మహానందంగా ఉందని రఘుశర్మ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో పౌరోహిత్యం చేస్తున్న యడవల్లి శివరామశర్మ ఎంబీఏ చదివారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో రెండేళ్లు హెచ్‌ఆర్ మెనేజర్‌గా పనిచేశారు. యాంత్రిక జీవనానికి అలవాటుపడి తన స్వధర్మాన్ని మరిచానని బాధపడుతూ.. పౌరోహిత్యం చేపట్టారు. ఉద్యోగమే జీవితానికి పరమావధి కాదని, పూజలు నిర్వహించడంలో గొప్ప సంతృప్తి ఉందని తెలిపారు. ధార్మిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక సంప్రదాయాలపై అవగాహన కల్పించినప్పుడు సమాజంలో మంచి మార్పు వస్తుందని చెప్పారు. సంపాదనకు అనేక అనేక మార్గాలు ఉన్నా మనస్సుకు నచ్చిన సేవ మార్గాన్ని ఎంచుకోవడంలో ప్రత్యేకమైన తృప్తి ఉంటుందని వివరించారు.
పూజలు నిర్వహిస్తున్న అర్చకుడి పేరు పవన్ కుమార్ శర్మ. ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన ఈ యువకుడు గుంటూరు వేద పాఠశాలలో చదివారు. అక్కడ నుంచి బేతంచెర్లకు వచ్చి అమ్మవారిశాల ఆలయ అర్చకునిగా 12 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారని, కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు స్వస్తి పలికినట్లు చెప్పారు. సంపాదనకోసం కాకుండా తమ పెద్దలు అందించిన ఆనవాయితీని కొనసాగిస్తూ భగవంతుని సేవలో తరిస్తున్నానని తెలిపారు. తల్లిదండ్రులు సుజాతమ్మ, శంకయ్య చూపిన అర్చకత్వం తన కుటుంబానికి మార్గం చూపిందన్నారు.
పోటీ ప్రపంచంలో సంపాదనే ధ్యేయంగా యువకులు ఏదైనా మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలవాలనుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ వైపు ఎక్కువ శాతం అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రంగాల్లో మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. అందులో పౌరోహిత్యం ఒకటని చెప్పవచ్చు. వైదిక విద్యపై కంటే ఆధునిక విద్యలపైనే యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో వేద పండితుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. హిందూ ధర్మ పరిరక్షణలో పురోహితులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ సమాజానికి, ఆధ్యాత్మికతకు మధ్య వారధిలా ఉన్నారు. వీరి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ఇలాంటి క్రమంలో కొందరు ఉన్నత చదువులు చదివినా వారసత్వంగా పౌరోహిత్యం వైపు మొగ్గు చూపుతున్నారు. పుట్టుక నుంచి మరణం వరకు జరిగే నామకరణం, ఉపనయనం, వివాహం, శ్రాద్ధకర్మలు వంటి ముఖ్యమైన జీవిత సంస్కారాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. పండుగలు, విశేష దినాల్లో పురాణ పఠనం, ప్రవచనాలు చేస్తూ సామాన్య ప్రజలకు ధర్మ మార్గాన్ని, ఆచారాల వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలియజేస్తున్నారు. కష్టసుఖాల్లో, శుభకార్యాల్లో కుటుంబాలను కలుపుతూ సమాజంలో నైతికతను, సాంస్కృతిక విలువలను నిలబెడుతున్నారు. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదుల సంఖ్యలో యువత పౌరోహిత్యంలో రాణిస్తున్నారు. ఉద్యోగాలు వదిలి వారసత్వంగా వస్తున్న ఈ వృత్తినే ఎంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో బ్రాహ్మణ కుటుంబాల నుంచి యువత పౌరోహిత్యం బాట పడుతున్నారు. పారితోషికం తక్కువ వస్తున్నా సంతృప్తికర జీవితాన్ని గడుపుతున్నామని యువ పురోహితులు చెబుతున్నారు.
– సాక్షి నెట్‌వర్క్
భక్తులకు స్వామివారి ఆశీర్వచనాలు అందిస్తున్న సూర్యనారాయణ శర్మ 1989లో బీకామ్, 1992లో బీఈడీ పూర్తి చేశారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన ఈయన 1998 డీఎస్సీకి ఎంపికయ్యారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసేవారు. తమ్ముడు టి. మహేశ్వరయ్య(మహేశ్వరశర్మ)మహానందిలో ఉండటంతో 2013లో ఇక్కడికి వచ్చారు. నష్టాలు చవిచూసినా.. మానసిక ప్రశాంతత కోసం భక్తులు సమర్పించే కొబ్బరికాయలు కొడుతూ అర్చక వృత్తిలో కొనసాగుతున్నారు. వందల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఆయన నేడు మహానందీశ్వరుడి సన్నిధిలో భక్తులు సమర్పించే కొబ్బరికాయలు కొడుతూ జీవనోపాధి పొందుతున్నారు.


