న్యాయమే గెలిచింది! | - | Sakshi
Sakshi News home page

న్యాయమే గెలిచింది!

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

చిప్పగిరి/కర్నూలు(టౌన్‌)/ఆలూరు రూరల్‌: టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, తప్పుడు కేసులు నమోదు చేయించినా చివరికి న్యాయమే గెలిచింది. అక్రమ కేసులో అరెస్టు అయ్యి 70 రోజులగా కర్నూలు జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి బెయిల్‌పై శనివారం విడుదలై స్వగ్రామం చిప్పగిరికి చేరారు. ఆలూరు నియోజకవర్గంలోని మాచపురం క్రాస్‌, కప్పట్రాళ్ల, ఈదుల దేవరబండ, దేవనకొండ క్రాస్‌ వద్ద కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకుని ఆయనకు స్వాగతం పలికి శాలువా,పూల మాలలతో సన్మానించారు. అలాగే మండల కేంద్రమైన ఆస్పరి, నియోజకవర్గ కేంద్రం ఆలూరు, చిప్పగిరిలో కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకుని ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. బెయిల్‌ పై విడుదలైన వారిలో ఆయన కుమారుడు బుసినె చంద్ర శేఖర్‌, సోదరుడు బుసినె శ్రీరాములు తదితరులు ఉన్నారు.

70 రోజులుగా జైలులో నిర్బంధం

ఆగస్టు నెల 1వ తేదీన చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్త గిరిపై నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు నాగరాజు, శివ దాడి చేశారు. దీంతో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించడానికి వెళ్లి వస్తుండగా నేమకల్లు గ్రామంలో ఎమ్మెల్యే విరుపాక్షిని ఆ గ్రామ టీడీపీ నాయకులు అడ్డగించి దాడులకు పాల్పడ్డారు. నియోజకవర్గ టీడీపీ నాయకుల ప్రోద్బలంతో సోదరుడు శ్రీరాము లు, తనయుడు చంద్రశేఖర్‌ పాటు మరో 40 మందిపై అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు అర్ధారాత్రి ఎమ్మెల్యే విరూపాక్షికి ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. 70 రోజుల పాటు కర్నూలు జైలులో ఉంచారు. శనివారం ఆయన జైలును నుంచి విడుదల కావడంతో వైఎస్సార్‌సీపీ నాయకుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

రాజకీయ కక్షలో భాగమే..

మంత్రి నారాలోకేష్‌, కర్నూలు రేంజ్‌ డీఐజీ రాజకీయ కక్షలో భాగంగానే అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. జైలు బయట ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనపై ఒక్క కేసు లేదని, అయినా అర్ధరాత్రి రెండు గంటలకు కరెంట్‌ కట్‌ చేసి, తలుపులు బద్ధలు కొట్లి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. ఫోన్‌ చేస్తే నేనే స్టేషన్‌కు వచ్చే వాడిని కదా అన్నారు. వైకుంఠం జ్యోతి తనకు తోబుట్టువులాంటిదని, అయితే ఎస్సీ మహిళతో కేసులు నమోదు చేయించి ఎస్సీలను సమాజంలో తలదించుకునేలా చేశారన్నా రు. తమ సామాజిక వర్గానికే చెందిన కాల్వ శ్రీనివాసులు, బీటీ నాయుడు, పార్థసారథి, గుడిసె క్రిష్ణమ్మలు తనపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. జులై నెలలో ఆస్పరికి వచ్చిన చంద్రబాబు నాయుడుకు మంచినీటి సమస్య గురించి చెప్పడం, మీడియాలో మాట్లాడటం చేసినందుకు నీ కథ చూస్తా.. అంటూ తనకు డీఎస్సీ వెంకట్రామయ్య ఫోన్‌ చేసి బెదిరించిన వారంలోపే అక్రమ కేసులు పెట్టారన్నారు.

ప్రజలకు అభివాదం చేస్తున్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

ఆటవిక పాలన

రాష్ట్రంలో బ్రిటీష్‌ కాలంనాటి ఆటవిక పాలన నడుస్తోందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేయాలంటే స్పీకర్‌ అనుమతి తప్పనిసరని, నిబంధనలు పాటించకుండా అరెస్టు చేశారన్నారు. అసెంబ్లీ ప్రీవిలేజ్‌ కమిటీని ఫిర్యాదు చేస్తామన్నారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం కక్ష రాజకీయాలు మానుకోవాలన్నారు. రెండున్నరేళ్లు హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే పనిగా ఈ ప్రభుత్వం చేస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తెర్నెకల్‌ సురేందర్‌ రెడ్డి, సుభాష్‌ చంద్రబోస్‌, గడ్డం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అండగా నిలిచిన జగనన్నకు కృతజ్ఞతలు

తనపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెటినా తన కుటుంబానికి మాజీ సీఎం జగనన్న అండగా నిలిచి ఎంతో భరోసా కల్పించారని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. మాజీ సీఎం జగనన్నకు అలాగే కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. వాల్మీకులను ఓటు బ్యాంకు కోసమే చంద్రబాబు వాడుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు బీసీలంటే ఇష్టం లేదన్నారు. వాల్మీకులను కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారన్నారు. 2014, 2019, 2024 సంవత్సరాల ఎన్నికల్లో వాల్మీకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వాల్మీకులను ఎస్సీల జాబితాలో చేర్చవచ్చు కదా అని ప్రశ్నించారు.

జైలు నుంచి ఆలూరు ఎమ్మెల్యే

విరూపాక్షి విడుదల

అడుగడుగునా

స్వాగతం పలికిన ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement