కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందున్న ప్రభుత్వ సంకేతాలకు అనుగుణంగా పోలీస్ శాఖ సన్నాహాక ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను పోలీస్ అధికారులు ఆదివారం పరిశీలించారు. జిల్లాలో 39 పోలీస్ స్టేషన్లు, నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. సర్కిళ్ల వారీగా ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, సమస్యాత్మకమైనవి ఏమిటో ఎస్‌ఐ, సీఐలు గుర్తిస్తున్నారు. క్యూలైన్ల ఏర్పాటుకు అవసరమైన స్థలం ఉందో లేదో పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలనే అంశంపై నివేదికలు తయారు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు దివ్యాంగు వస్తే, అంధులు వస్తే సహకరించేందుకు ఎంత మంది సిబ్బంది అవసరమవుతారో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ర్యాంపులు లేని పోలింగ్ కేంద్రాలు వివరాలు తీసుకుంటున్నారు. అలాగే రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. పాత నేరస్తులు, జిల్లా బహిష్కరణ చేసిన వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.


