ఆస్పరి: ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొని వ్యవసాయ పనులు లేకపోవడంతో గ్రామీణ ప్రజలు వలస బాట పట్టారు. వారం రోజులు నుంచి యాటకల్లు, కైరుప్పల, ఆస్పరి తదితర గ్రామాల కూలీలు పిల్లా పాపలతో తెలంగాణలో పత్తి కోతలకు వలస వెళ్తున్నారు. స్థానికంగా పనులు లేకపోవడంతో కుటుంబం గడిచేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో వలస వెళ్సాల్సి వస్తుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మండలంలోని కైరుప్పల గ్రామానికి చెందిన 12 కుటుంబాలు బొలొరో వాహనంలో తెలంగాణకు వెళ్లాయి. పిల్లలతో కలసి రెండు నెలలు పాటు అక్కడే ఉంటామని చెప్పారు.


