నేడు డయల్‌ యువర్‌ సీఎండీ, ఎస్‌ఈ | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ సీఎండీ, ఎస్‌ఈ

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): డయల్‌ యువర్‌ ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్‌ భవన్‌లో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం సో మవారం జరుగుతుందని ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమస్యలు చెబితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

హంద్రీ–నీవాకు

ఇక ఆరు రోజులే నీరు

కృష్ణగిరి: హంద్రీ–నీవా ప్రధాన కాలువ ద్వారా ఇక ఆరు రోజులు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని హంద్రీ–నీవా సర్కిల్‌–1 జిల్లా పర్యవేక్షక ఇంజనీర్‌ రాజన్‌బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో రోజు రోజుకు నీటిమట్టం తగ్గుతుండటతో నీటి సరఫరా ఉండబోదన్నారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా రిజర్వాయర్‌లకు చేరిన నీటిని తాగునీటి అవసరాలకే వాడుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది జూన్‌ వరకూ తాగునీటి అవసరాలకు మాత్రమే కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్‌ల నీటిని వాడుకోవాలన్నారు.

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

కర్నూలు(సెంట్రల్‌): కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలు ఉన్న ప్రజలు అర్జీలను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

స్పెషల్‌ టెట్‌కు

20 మంది గైర్హాజరు

కర్నూలు సిటీ: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం మాత్రమే ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఆదివారం ప్రారంభమైంది. జిల్లాలో రెండు కేంద్రాలు, హైదరాబాదులో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సెషన్‌లో మాత్రమే నిర్వహించిన పరీక్షకు 1029 మందికిగాను 1009 మంది హాజరయ్యారు. ఒక కేంద్రంలో 20 మంది గైర్హాజరయ్యారు. ఏళ్లుగా బోధన వృత్తిలో ఉన్నా టెట్‌ రాయడం ఏమిటని, మినహాయింపుపై కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చర్చలు ఎందుకు జరపడం లేదని కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇచ్చిన స్టడీ మెటీరియల్‌లో నుంచే ప్రశ్నలు ఇవ్వడంతో పరీక్ష సులువుగానే ఉందని మరికొందరు ఉపాధ్యాయులు తెలిపారు.

దసరా బిగ్‌సేల్‌ ఆఫర్ల లింక్‌లను నమ్మొద్దు

● ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు: సోషల్‌ మీడియాలో వచ్చే దసరా బిగ్‌సేల్‌ ఆకర్షణీయమైన ఫెస్టివల్‌ ఆఫర్ల లింక్‌లను నమ్మవద్దుని, వాటిపై క్లిక్‌ చేసి వ్యక్తిగత బ్యాంకింగ్‌ వివరాలు, ఓటీపీలు నమోదు చేయవద్దని జిల్లా ప్రజలకు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ విజ్ఞప్తి చేశారు. దసరా పండుగ సెలవుల నేపధ్యంలో సైబర్‌ మోసాలు, నకిలీ ఈ–చలాన్‌, ఏబీకే ఫైల్‌, ఇళ్ల దొంగతనాల పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వాహనాలపై ట్రాఫిక్‌ ఈ–చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నాయంటూ వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా వచ్చే గుర్తు తెలియని లింక్‌లను క్లిక్‌ చేయవద్దని, వాటి ద్వారా పంపే ఏబీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేయవద్దని తెలిపారు. పోలీసు శాఖ తరఫున ఈ–చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్స్‌ పంపరని స్పష్టం చేశారు. వివరాలను అధికారిక ఈ–చెలాన్‌ పోర్టల్‌లో మాత్రమే తనిఖీ చేసుకోవాలని సూచించారు. కొనుగోళ్ల కోసం అధికారిక యాప్‌లను మాత్రమే వినియోగించాలని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే1930 నెంబర్‌కుఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement