జేజేఎం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రూ.28.57 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. బిల్లులు పెండింగ్ లో ఉంచడంతో అనేక గ్రామాల్లో జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. పైప్‌లైన్ల కోసం తవ్విన రోడ్లు, సగం వరకు ఆగిన ఓవర్ హెడ్ ట్యాంకులు ఆయా ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో పనులు పూర్తి చేసినా, బిల్లులు విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జేజేఎం పనులు చేసిన కాంట్రాక్టర్లు ఈ నెల 26న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఆందోళన కూడా చేపట్టారు. చేసిన పనులకు సంబంధించి బిల్లులను అప్ లోడ్ చేసినా, నేటికి విడుదల కాకపోవడంతో పలు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు.
ఉల్చాలలో అలంకార ప్రాయంగా నిలిచిన నీటి ట్యాంకు
గోనెగండ్లలో నిలిచిన
ట్యాంకు పనులు
అర్ధంతరంగా నిలిచిపోయిన
ఓవర్ హెడ్ ట్యాంకు


