క్రీడాకారిణికి ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారిణికి ఆర్థిక సాయం

Aug 3 2026 3:45 AM | Updated on Aug 3 2026 3:45 AM

గడివేముల: అంతర్జాతీయ గోల్‌ షాట్‌బాల్‌ పోటీలకు ఎంపికై న విద్యార్థిని జగదీశ్వరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఇంటి వద్ద జగదీశ్వరికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందించడంతోపాటు సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. క్రీడాకారిణికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఎల్లారెడ్డి, అనిల్‌కుమార్‌ రెడ్డి, సర్వేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement