రెవెన్యూ శాఖదే విజయం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ శాఖదే విజయం

Aug 3 2026 3:45 AM | Updated on Aug 3 2026 3:45 AM

పాణ్యం: ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో రెవెన్యూ శాఖ జట్టు ఆర్‌జీఎం జట్టుపై విజయం సాధించినట్లు జిల్లా అధ్యక్షుడు కామేశ్వరరెడ్డి తెలిపారు. ఆదివారం ఆర్‌జీఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో రెవెన్యూ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ, ఆర్‌జీఎం జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ పోటీల్లో రెవెన్యూ శాఖ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 138 పరుగులు చేసి ఐదు పరుగుల తేడాతో ఆర్‌జీఎం జట్టుపై విజయం సాధించింది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ ఘనోరి అత్యధికంగా 41 పరుగులు సాధించారు. నంద్యాల ఆర్డీఓ చల్లా విశ్వనాథ్‌, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కామేశ్వరరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, నంద్యాల అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీనివాసులు, పీడీ వెంకటేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement