ప్రాణం తీసిన స్పీడ్‌బ్రేకర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన స్పీడ్‌బ్రేకర్‌

Mar 17 2026 7:46 AM | Updated on Mar 17 2026 7:46 AM

నందికొట్కూరు: పట్టణ సమీపంలోని మార్కెట్‌ యార్డు ఎదురుగా ప్రధాన రహదారిపై వేసిన స్పీడ్‌ బ్రేకర్‌ ఒక ప్రాణం తీసింది. స్పీడ్‌ బ్రేకర్‌ ఎత్తుగా వేయడంతో బైక్‌పై కూర్చొన్న ఫక్కీరెడ్డి భాస్కర్‌రెడ్డి భార్య ఫక్కీరెడ్డి పద్మావతమ్మ(58) కింద పడి ఈ నెల 14న కోమాలోకి వెళ్లారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతి చెందారు. ఇష్టానుసారంగా స్పీడ్‌బ్రేకర్‌ వేయడంతోనే తన భార్య మృతి చెందారని ఫక్కీరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు.

కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

ఆదోని అర్బన్‌: స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామకృష్ణను సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల క్రితం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గార్డెనియా విల్లాస్‌లో రాఘవేంద్ర అనే బాధితుడు ఇంటి దగ్గర కానిస్టేబుల్‌ రామకృష్ణ ప్రహరీని పగలగొట్టి భయబ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో రామకృష్ణపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీంతో రామకృష్ణను సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వులు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement