భారీగా మద్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

భారీగా మద్యం పట్టివేత

Mar 17 2026 7:45 AM | Updated on Mar 17 2026 7:45 AM

ఎమ్మిగనూరురూరల్‌: ఎమ్మిగనూరు పట్టణం వెంకటాపురం కాలనీలో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ సూపరిండెంట్‌ సుధీర్‌బాబు తెలిపారు. ఆంజనేయులు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా మద్యం డంప్‌ చేసినట్లు పక్కా సమాచారం రావటంతో దాడిచేసి పట్టుకున్నట్లు చెప్పారు. ఆంజనేయులు సైన్యంలో చేరి రిటైర్ట్‌ అయ్యాడని, చౌకధరతో తెచ్చిన మద్యాన్ని అధికర ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించారన్నారు. మొత్తం 100 బాక్సులు తెచ్చినట్లు, అందులో 50 బాక్సులు విక్రయించగా మిగిలినవి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు మద్యాన్ని సైన్యం నుంచి తెచ్చుకున్న చెక్కపెట్టెలో రైలులో తీసుకువస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. వీటి విలువ దాదాపు రూ. 6 లక్షలు పైగా ఉంటుందన్నారు. నిందితుడిపై ఇదే స్టేషన్లో మూడు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. మద్యం బాటిల్స్‌పై అరుణాచలం స్టిక్కర్లు ఉన్నాయని, వీటిని అక్కడే నుంచే తెచ్చాడా, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చాడా అనేది విచారణ తరువాత వెల్లడిస్తామని చెప్పారు. ఈ కేసును ఛేదించడంతో ఎకై ్సజ్‌ అిసిస్టెంట్‌ సూపరిండెంట్‌ రామకృష్ణారెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజేంద్రప్రసాద్‌, కర్నూల్‌ సీఐ చంద్రవాస్‌, ఎమ్మిగనూరు ఎకై ్సజ్‌ సీఐ రమేష్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement