కర్నూలు(టౌన్): డ్రగ్స్ లేకుండా చేస్తా అని ప్రచారం చేసి, చివరకు డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఆ పదవికి అనర్హుడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్ల చంద్రబాబు పాలనలో అరాచకాలు, మహిళలపై దాడు లు, వేధింపులు పెరిగిపోయాయన్నారు. మొయినాబాద్ ఫాంహౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలియడంతో అక్కడకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై ఐదు రౌండ్ల కాల్పులు జరపడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేయడంతోనే రాష్ట్రంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోతున్నారన్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేశాడన్నారు. అదే పార్టీకి చెందిన కిరణ్ రాయ ల్, కూన రవికుమార్ మహిళలను వేధిస్తు న్నా అధినేత పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నజీర్ తమను వేధిస్తున్నాడని ఆ పార్టీ మహిళా నాయకురాళ్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వీరి నిర్లక్ష్యంతోనే వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితికి కారణమైందన్నారు. వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు వేసి, దౌర్జన్యం చేసి, మహిళలను సైతం తీవ్ర భయాందోళనలకు గురి చేసింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. కర్నూలులో అర్ధరాత్రి మద్యం సేవించిన మంత్రి టీజీ భరత్ అనుచరులు మహిళా ఎస్‌ఐపై దౌర్జన్యం చేయ్యలేదా.. దాడికి యత్నించలేదా? ఎలాగోలా మద్యం మత్తులో ఉన్నవారిని స్టేషన్‌కు తరలిస్తే అక్కడ వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు కుర్చీలో కూర్చోబెట్టి టీ తాగించి పంపించారన్నారు. విద్యా రంగ సమస్యలు పట్టించుకోకుండా మంత్రి నారా లోకేష్ వీడియో గేమ్స్, క్రికెట్ చూడటం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. ఈ రాష్ట్రానికి సుపరి పాలన ఒక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు.


